తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

21 Jun, 2021 17:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్‌ (ఎంసెట్‌).. ఆగస్టు 9,10 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ (ఎంసెట్‌).. ఆగస్టు 3న ఈసెట్‌, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్‌.. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్‌, ఆగస్టు 23న లాసెట్‌.. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్‌, జులై 17న పాలిసెట్‌ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉంది. నేరుగా క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 8 నుంచి ఆపై తరగతులకు నేరుగా క్లాసులు నిర్వహించే యోచన చేస్తోంది. 7వ తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలనుకుంటోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు