‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత’ 

7 Nov, 2021 04:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పర్యావరణం ప్రతి ఒక్కరి హక్కు. అయితే, దాని పరిరక్షణ బాధ్యత కూడా అందరిది’అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి పేర్కొన్నారు. కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్, ధర్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతిని దేవుడిగా భావించాలని సూచించారు. నదులు, నదీ జలాలను కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.

పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్‌ ఖాదర్‌ వలి మాట్లాడుతూ.. జీవనశైలిలో వస్తున్న మార్పులను విశదీకరించారు. తృణధాన్యాల వినియోగంతో జీవనశైలి వ్యాధులను అరికట్టవచ్చని, వాతావరణ మార్పుల సమస్యలను కూడా అధిగమించవచ్చని పేర్కొన్నారు. పారిశ్రామిక ఆహార సంస్కృతి పోవాలని, సాత్విక జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.  

మరిన్ని వార్తలు