గవర్నర్‌ తమిళిసైకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ కౌంటర్‌

26 Jan, 2023 18:37 IST|Sakshi

సాక్షి, వరంగల్: తెలంగాణలో సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఈ ఏడాది కూడా సీఎం కేసీఆర్‌, మంత్రులు డుమ్మా కొట్టారు. దీంతో, కేసీఆర్‌ ప్రభుత్వం తీరుపై గవర్నర్‌ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి గవర్నర్‌కు కనిపించడం లేదా?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో​ ఇంత అభివృద్ధి జరిగిందా?. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా తమిళిసై వ్యవహరిస్తు‌న్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. 

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గవర్నర్‌ను చూడలేదు. అంతపెద్ద  సెక్రటేరియేట్ నిర్మాణం జరిగితే కనిపించడం లేదా.. అది అభివృద్ధి కాదా?. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ మంచి నీళ్లు ఇస్తున్నాము. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతోంది. రైతు సంక్షేమ తెలంగాణలో గవర్నర్‌కు ఆత్మహత్యలు కనిపిస్తున్నాయా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

మరిన్ని వార్తలు