Errabelli Dayakar Rao: మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’

8 Jun, 2022 07:29 IST|Sakshi
సోమిరెడ్డి పాడె మోస్తున్న మంత్రి దయాకర్‌రావు  

దేవరుప్పుల/బయ్యారం: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పరిధి కామారెడ్డిగూడెంలో కన్నుమూసిన విశ్రాంత ఉపాధ్యాయుడు, టీఆర్‌ఎస్‌ మండల నేత బిల్లా సోమిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చివరి వరకు మాస్టారి పాడె మోసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. సోమిరెడ్డి భౌతికకాయాన్ని మంత్రి మంగళవారం సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ.. తాను పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉండి రాజకీయ సూచనలు, సలహాలు అందజేసిన మాస్టారు సేవలు మరువలేనివంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

పంచాయతీలకు బాకీ లేదు: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా బాకీ లేదని మంత్రి దయాకర్‌రావు అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సర్పంచులను రెచ్చగొడుతున్నారన్నారు. కరోనా మూలంగా మూడేళ్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయని మాట వాస్తవమేనన్నా రు.  సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. 

చదవండి: (పలుమార్లు లైంగిక దాడి.. వారం రోజుల క్రితం)

>
మరిన్ని వార్తలు