రూ. 38 వేల కోట్లతో పూర్తిచేస్తాం

5 Nov, 2020 02:12 IST|Sakshi

మిషన్‌ భగీరథ పథకంపై మంత్రి ఎర్రబెల్లి 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎక్కడాలేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకాన్ని రూ.46 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టామని, అయితే రూ.38 వేల కోట్లతోనే ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. బుధవారం మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కార్యాలయంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ, మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రంలో 23 వేల 787 ఆవాసాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 18,175 వాటర్‌ ట్యాంకులలో, ఇప్పటికి 18,076 పూర్తయ్యాయని, మిగిలిన 99 ట్యాంకులు కూడా నవంబర్‌ 30 వరకు పూర్తి చేస్తామని వివరించారు. మిషన్‌ భగీరథ పథకం మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్న పథకం అని హడ్కో 3సార్లు అవార్డు అందజేసిందని, నీటి వినియోగ సామర్థ్యం 20 శాతం పెంచినందుకు, జాతీయ వాటర్‌ మిషన్‌–2019లో మిషన్‌ భగీరథకు మొదటి బహుమతి లభించిందని మంత్రి వెల్లడించారు.  

>
మరిన్ని వార్తలు