తెలంగాణలో పెట్టుబడుల జోరు..!

17 Aug, 2020 16:24 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈస్టర్‌ పిల్మ్‌ టెక్‌ అనే పాలిస్టర్‌ తయారీ సం‍స్థ రూ.1,350 కోట్లతో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ వర్గాలు సొమవారం తెలిపాయి. ఈ తయారీ సంస్థ స్థాపనతో ప్రత్యక్షంగా 800 మందికి ఉపాధి లభించనుంది. ప్యాకేజింగ్‌ విభాగంలో రాష్ట్రానికి 30 నుంచి 40 శాతం ఉత్పత్తే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. మొదటి దశలో(2022 సంవత్సరం చివరి నాటికి)  రూ.50 0కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఈస్టర్‌ పిల్మ్‌ టెక్‌ భావిస్తోంది.

ఈస్టర్‌ సంస్థ ఇంజనీరింగ్‌, ప్లాస్టిక్‌ తదితర రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన వృద్ధి సాధించింది. ప్రస్తుతం 56 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఉత్తరఖండ్‌ రాష్ట్రంలో భారీ స్థాయిలో తయారు ప్లాంట్‌లను నెలకొల్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సరళీకృత పెట్టుబడుల విధానం పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
చదవండి: శంకర్‌ పల్లికి భారీగా పెట్టుబడులు

మరిన్ని వార్తలు