సొంతపార్టీ నాయకులనే అంగట్లో పశువుల్లా కొంటున్నారు

25 Jul, 2021 07:43 IST|Sakshi

సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్‌): కుట్రలు, కుతంత్రాలు చేస్తే తెలంగాణ ప్రజలు బొందపెడతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రజాదీవెనయాత్రలో భాగంగా ఆరోరోజు శనివారం ఇల్లందకుంట, మల్యాల, లక్ష్మాజీపల్లి, వాగుఒడ్డు రామన్నపల్లి, కనగర్తి గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఈటల మాట్లాడుతూ.. గతంలో ఆర్థిక మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా మంచి పేరొస్తోందని కుట్రపన్ని, కొత్త మందికి డబ్బులు ఇచ్చి దరఖాస్తు తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులనే అంగట్లో పశువుల్లాగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు.

డబ్బుల సంచులకు కాలం చెల్లిపోయిందని నిరూపించే ఎన్ని కలివి అని పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈటల పాదయాత్రలో కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కంకణాల శ్రీలత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రే మేందర్‌ రెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జీ జితేందర్‌రెడ్డి, చాడసురేశ్‌రెడ్డి,బొడిగె శోభ, తులఉమ పాల్గొన్నారు. 

మానవమృగం ముఖ్యమంత్రి 
మానకొండూర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి మానవత్వం లేని మృగమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మానకొండూర్‌ మండలంలోని గట్టుదుద్దెనపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న వరిపంటను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అయినా ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకోలేదని మండిపడ్డారు. పసల్‌బీమాను అమలు కానివ్వడని అన్నారు.

గంగిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా కార్యదర్శి రంగుభాస్కరాచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా పరామర్శించారు. కొండపల్కలలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి తల్లి మృతి చెందగా పరామర్శించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, కటకం మృత్యుంజయం, మండల అధ్యక్షుడు రాపాక ప్రవీణ్, నాయకులు సోన్నాకుల శ్రీనివాస్, దుర్గం శ్రీనివాస్, ప్రదీప్‌యాదవ్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

      

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు