రాష్ట్రంలో డిసీజ్‌ మ్యాపింగ్‌: ఈటల

22 Sep, 2020 04:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో ఫ్లోరైడ్, మలేరియా, బోదకాలు.. తదితర జబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయన్న దానిపై ‘డిసీజ్‌ మ్యాపింగ్‌’ చేయాలి. దానికి అనుగుణంగా ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్లు, మందులుండేలా చూడాలి’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణ లకు శ్రీకారం చుట్టాలని ఈటల ఆదేశించారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో, ఇతర ఆసుపత్రుల్లో ఏం జరుగుతుందో.. హైదరాబాద్‌లో కమాండ్‌ కం ట్రోల్‌ సెంటర్‌లో ఉండి చూడగలిగే విధంగా ఏర్పాట్లు చేయాలన్నా రు.  పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న మందుల గడువు  వివరాలను కంప్యూటరీకరించాలని సూచించారు. పీహెచ్‌సీల్లో అనవసర మందు లుంచవద్దన్నారు. మొదటిసారి గడువు ముగిసిన మందులను కంపెనీలకు తిప్పి పంపి డబ్బులు వెనక్కి తీసుకున్నా మ న్నారు.  ప్రభు త్వాసుపత్రుల్లో రెఫరల్‌ విధా నం, ఆశ వర్కర్లు రోగులను పెద్దాసుపత్రులకు పంపించే విధానం అమలు కావాలన్నా రు. ప్రతి ఆసుపత్రిలో రిసెప్షన్‌ సెంటర్‌ ఉం డాలన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బంధువులకు ఎప్పటికప్పుడు చెప్పాలన్నారు.

మరిన్ని వార్తలు