పోస్టాఫీసుల్లో డిజిటల్‌ సేవలు

28 Apr, 2022 08:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తపాలా శాఖ డిజిటల్‌ సేవలకు సిద్ధమైంది. ఇప్పటి ఇండియా పోస్టల్‌  పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా డిజిటల్‌ సేవలందిస్తున్న పోస్టల్‌ శాఖ తాజాగా పోస్టాఫీసుల్లో జరిగే సాధారణ లావాదేవీలను సైతం డిజిటల్‌ సేవలకు శ్రీకారం  చుట్టింది.  స్పీడ్, రిజిస్టర్డ్, పార్శిల్‌ సర్వీస్‌ చార్జీలను డిజిటల్‌ చెల్లింపులకు అనుమితిస్తోంది. నగదుతో పని లేకుండా జీ పే, ఫోన్‌పే ద్వారా చార్జీలను స్వీకరిస్తోంది. వినియోగదారులకు వెసులుబాటు కలిగినట్లయింది.

(చదవండి: సిలిండర్‌ వెయ్యి అయ్యింది. మహిళలకు కట్టెల పొయ్యే దిక్కయింది: కేటీఆర్‌)

మరిన్ని వార్తలు