నియోజకవర్గానికో ఉచిత కోచింగ్‌ సెంటర్‌

3 May, 2022 08:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్లకు అదనంగా హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని నియోజకవర్గానికి ఒకటి చొప్పున శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. సోమవారం మాసాబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉచిత కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమెల్సీలు ప్రభాకర్, స్టీఫెన్‌సన్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గో పాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్‌ హుస్సేన్, జిల్లా కలెక్టర్‌ శర్మన్, జేడీ అలోక్‌ కుమార్‌ డీడీఆశన్న,  ఎస్‌ఈ కార్పో రేషన్‌ డీడీ రామారావు, మైనారిటీ వెల్ఫేర్‌ డీడీ ఖాసీం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.  

(చదవండి: తెలంగాణ గ్రూప్‌-1 పోస్టులకు అప్లై చేస్తున్నారా? బబ్లింగ్‌తో జర భద్రం!)

మరిన్ని వార్తలు