గణేష్‌ నిమజ్జనంలో తుపాకీతో కాల్పులు

28 Aug, 2020 09:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వినాయకుని విగ్రహం నిమజ్జనం సందర్భంగా ఆర్మీ మాజీ జవాన్‌ ఒకరు తుపాకీతో హల్‌ చల్‌ చేశాడు. పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరపడంతో నిమజ్జనంలో పాల్గొన్నవారు భయభ్రాంతులకు లోనయ్యారు. నార్సింగిలోని హైదర్ష్‌కోటలో శివం హైట్స్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తిని నాగ మల్లేష్‌గా గుర్తించారు. నాగ మల్లేష్‌ రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో.. ఒకటి గాల్లోకి వెళ్లగా, మరకొటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
(చదవండి: నిబం‍ధనలు గాలికి వదిలేసి.. ప్రయాణం..)

మాట వినకపోవడంతో..
ఘటనపై అపార్ట్‌మెంట్‌ వాసులు, వాచ్‌మన్‌ మాట్లాడుతూ.. హై రీచ్ బ్రాడ్ బ్యాండ్ మొదటి ఫ్లోర్‌లో ఉంది. వాళ్ల ఆఫీస్‌లో గణేష్ నిమజ్జనానికి 40 మందికిపైగా వచ్చారు. లిఫ్ట్ లో కిందకి పైకి తిరుగుతూనే ఉన్నారు. గట్టిగట్టిగా అరుస్తున్నారు. మెట్లపై, టెర్రస్‌పై మద్యం తాగుతూ హంగామా చేశారు. మేము హెచ్చరించినా పట్టించుకోలేదు. మూడో ఫ్లోర్‌లోని ఫ్లాట్‌లో ఉండే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మల్లేష్‌ పైకి వెళ్లి మద్యం తాగొద్దు అని చెప్పాడు. అయినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో ఓసారి ఫైర్ చేసాడు. అందరూ కిందకి వచ్చి సెల్లార్ లో డ్యాన్సులు చేస్తూ అరుస్తుండటంతో.. మరోసారి గాల్లోకి ఫైర్ చేశాడు.

మరిన్ని వార్తలు