మాజీ మంత్రి గీతారెడ్డి దంపతులకు కరోనా

18 May, 2021 02:36 IST|Sakshi

సాక్షి, జహీరాబాద్‌: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జె.గీతారెడ్డి కరోనా బారిన పడ్డారు. సోమవారం ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తనతో పాటు తన భర్త రాంచంద్రారెడ్డికి పాజిటివ్‌ వచ్చినట్లు గీతారెడ్డి తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

బీజేపీ నేత కె.లక్ష్మణ్‌కు కరోనా 
ముషీరాబాద్‌(హైదరాబాద్‌): బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా జాతీ య అ«ధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం జ్వరం, దగ్గు, బాడీ పెయిన్స్‌ తదితర లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా లక్ష్మణ్‌ సూచించారు. విషయం తెలుసుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఫోన్‌లో లక్ష్మణ్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఐదుగురు కార్పొరేటర్‌లు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు