30 ఏళ్లపాటు సేవలు.. డ్రైవర్‌ పాడె మోసిన మాజీ మంత్రి

22 May, 2022 13:57 IST|Sakshi
కృష్ణ పాడె మోస్తున్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి  

సాక్షి, ఖమ్మం: వాహనం డ్రైవర్‌గానే కాకుండా కుటుంబానికి ఆప్తుడిగా ముప్పై ఏళ్ల పాటు సేవలందించిన వ్యక్తి మృతి చెందడంతో... ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన మాజీ మంత్రి కృతజ్ఞత చాటుకున్నారు. కామేపల్లికి చెందిన సిద్ధబోయిన కృష్ణ(59) మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి డ్రైవర్‌గా పనిచేశాడు. అంతేకాకుండా ముప్పై ఏళ్ల ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. కాగా, కృష్ణ శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు.

విషయం తెలియగానే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు చేరుకుని నివాళులర్పించారు. కృష్ణ అంత్యక్రియల్లో పాడె మోసిన దామోదర్‌రెడ్డి.. తమ కుటుంబానికి  కృష్ణ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, జెడ్పీటీసీ బానోత్‌ వెంకటప్రవీణ్‌కుమార్, నాయకులు నర్సింహారెడ్డి, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, చీమల వెంకటేశ్వర్లు, భూక్యా దళ్‌సింగ్, లక్కినేని సురేందర్, డాక్టర్‌ భూక్యా రాంచందర్‌నాయక్, జి.రవి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఆదిలాబాద్‌: ఆఫీసర్స్‌ క్లబ్‌లో రికార్డింగ్‌ డ్యాన్సులు

మరిన్ని వార్తలు