నకీలీ సర్టిఫికెట్‌తో ఎంపీపీ పదవి.. ఎ‍మ్మార్వో​ ఆఫీస్‌లో ఫైల్‌ మాయం..

30 Jun, 2021 11:45 IST|Sakshi

సాక్షి, దేవరకద్ర(మహబూబ్‌నగర్‌):  తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దేవరకద్ర ఎంపీపీ రమాదేవి ఎంపీపీ పదవి పొందారని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆరోపించారు. మంగళవారం దేవరకద్రలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఓసీ కులానికి చెందిన రాములమ్మ, పదవి కోసం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి బీసీ సర్టిఫికెట్‌ పొందారని, బీసీ మహిళలకు రిజర్వు అయిన దేవరకద్ర ఎంపీపీ పదవిని చేజిక్కించుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన శ్రీకాంత్‌యాదవ్‌ తన భార్య అయిన రాములమ్మ అలియాస్‌ రమాదేవిని ఎంపీపీ పదవి కోసం అప్పటి తహసీల్దార్‌ చెన్నకిష్టన్న సహకారంతో బీసీ సర్టిఫికెట్‌ పొందారని ఆరోపించారు.

ఈ తప్పు బయటపడకుండా తహసీల్దార్‌ కార్యాలయంలో ఫైల్‌ను అపహరించారని అన్నారు. బీసీ మహిళకు కేటాయించిన స్థానంలో ఓసీ మహిళను ఎన్నుకోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సమావేశంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ప్రశాంత్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాందాసు, కిషన్‌రావు, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.    

చదవండి: నెల క్రితం మిస్సింగ్‌.. 10 అడుగుల లోతులో అస్థిపంజరాలు 

మరిన్ని వార్తలు