ప్రశ్నల ట్రెండ్‌ మారొచ్చు 

6 May, 2022 01:52 IST|Sakshi

సివిల్స్‌ ప్రిలిమ్స్‌పై నిపుణులు.. ఈసారి అంతర్జాతీయ వ్యూహాలకు ప్రాధాన్యం 

కరోనా, ప్రైవేటు స్పేస్‌ ఏజెన్సీలకూ స్థానం.. నెల రోజుల్లో నీట్‌గా చదవాల్సిందేనని సూచన

సాక్షి, హైదరాబాద్‌: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) జూన్‌ 5న నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ఈసారి భిన్నంగా ఉండే అవకాశం ఉం దని నిపుణులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనట్లు ఈసారి అంతర్జాతీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని, ప్రధాని మోదీ వ్యూహాత్మక అంతర్జాతీయ సంబంధాలు పరీక్షలో కీలకపాత్ర పోషించే వీలుందని భావిస్తున్నారు. రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గమనం, వ్యాక్సినేషన్, పరిశోధనలపై ప్రశ్నలకు ఎక్కువ చాన్స్‌ ఉంటుందని అంచనా. టెక్నా లజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలూ ప్రశ్నావళిలో కనిపిస్తాయని చెబుతున్నారు. ప్రిలిమ్స్‌కు ప్రణాళికాబద్ధంగా చదవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.  
వీటిపై దృష్టి పెట్టాలి 

  • మోదీ డెన్మార్క్‌ పర్యటన, నార్డిక్‌ దేశాల సంబంధాలపై ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశముంది. నార్డిక్‌ దేశాలేవనే ప్రశ్న వచ్చే అవకాశం కన్పిస్తోంది. నాటో దేశాల గురించి తెలుసుంటే మంచిది. రష్యా–ఉక్రెయిన్‌ దాడిలో నల్ల సముద్రానికి కీలకపాత్ర. ఇందులోంచి ప్రశ్నలు రావచ్చు. 
  •  గవర్నర్, రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలకు తేడా పై చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌ పదజాలం, విధివిధానాలు, పార్టీ ఫిరాయింపుల చట్టం, స్పీకర్‌ అధికారాలను పరిశీలించాలి. 
  •   శాస్త్రసాంకేతిక విజ్ఞానంలో బయోటె క్నాలజీ, జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ ప్రధానాంశాలు కావచ్చు. ఇస్రో,నాసా,ప్రైవేటు స్పేస్‌ ఏజెన్సీల నుంచి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నా యి. ఈసారి ఈ సంస్థల సరికొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలి. నానో టెక్నాలజీ, రోబో టిక్స్‌పై ప్రశ్నలు ఉంటాయని భావిస్తున్నారు. 
  •  కరోనా తర్వాతి మైక్రో బేస్డ్‌ అధ్యయనాలు ప్రిలిమ్స్‌లో అడిగే వీలుంది. ముఖ్యంగా వైరస్‌ రూపాంతరం, వాటి చరిత్ర, వ్యాక్సిన్, పరిశోధనలు లోతుగా అడగొచ్చు. టార్గెటెడ్‌ డ్రగ్‌ డెలివరీపై ప్రత్యేక అధ్యయనం అవసరం.  
  •  నేషనల్‌ పార్కులు, మ్యాప్స్,  పర్యావరణ విధానాలు, చట్టాలు, సంస్థలు, గ్రాఫీన్‌ అనే సబ్జెక్ట్‌ (ఒక విధమైన కార్బన్‌) ఈసారి రావచ్చు. ఫిజిక్స్‌లో బేసిక్స్‌ తప్పకుండా చూడాలి. 

నెల రోజులు ప్రణాళికతో సిద్ధమవ్వాలి 
ప్రిలిమ్స్‌కు ప్రణాళికాబద్ధంగా, అంశాల వారీగా ప్రిపేర్‌ కావాలి. రెండుమూడు రోజులకో సబ్జెక్టు రివిజన్‌ చేసుకోవాలి. ప్రిలిమ్స్‌లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మూలస్తంభాలు. సైన్స్‌ అండ్‌ టె క్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, అంతర్జాతీయ, ప్రాం తీయ సంబంధాలు రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. ఈమధ్య ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ కొత్తగా వచ్చింది.  – బాలలత (సీబీఎస్, ఐఏఎస్‌ అకాడమీ, హైదరాబాద్‌)     

మరిన్ని వార్తలు