వివాహేతర సంబంధం.. భర్తకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానంతో

6 May, 2022 20:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వేములవాడ: ప్రియురాలి భర్తపై హత్యాయత్నం చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడటౌన్‌ సీఐ వెంకటేశ్‌ తెలిపిన వివరాలు.. వేములవాడకు చెందిన మహిళకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లెకు చెందిన విష్ణుతో 2011లో వివాహమైంది. విష్ణు ఉపాధి కోసం దుబాయి వెళ్లి వస్తుండగా అతని భార్య వేములవాడకు చెందిన సాయికుమార్‌తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది.

గత మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇటీవల మళ్లీ భర్త విష్ణుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానం సాయికుమార్‌కు కలిగింది. బుధవారం రాత్రి విష్ణు వేములవాడ మీదుగా కరీంనగర్‌ వెళ్తున్నట్లు తెలుసుకొని తన స్నేహితుడు దేవేందర్‌తో కలిసి హత్యకు ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్న విష్ణు వేములవాడటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. సాయికుమార్, దేవేందర్‌లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు