సామీజీల వేషం.. పూజలంటూ మోసం

8 Dec, 2021 12:43 IST|Sakshi
నిందితులతో మాట్లాడుతున్న పోలీసులు

సాక్షి, జగిత్యాల(కరీంనగర్‌): వారు స్వామీజీల వేషం కట్టారు.. రెండ్రోజులుగా ఇంటింటికీ తిరుగుతున్నారు.. సమస్యలు పరిష్కరిస్తామని నమ్మిస్తున్నారు.. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చుతామని చెబుతూ పూజలు చేస్తున్నారు.. తాయత్తులు కడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు.. నిందితులను జగిత్యాల ఖిలాగడ్డ ప్రాంతంలో స్థానికులు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్వామిజీల అవతారంలో రెండు రోజులుగా ఖిలాగడ్డ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్తున్నారు. ముందుగా వీరిలో ఒకరు మీ ఇంట్లో సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి, వెళ్తారు.

గంట తర్వాత మరొకరు వచ్చి, లేని సమస్యలు ఉన్నట్లు నమ్మించి, రూ.2 వేలు, రూ.2,500 విలువైన తాయత్తులు ఉన్నాయని, వాటిని కట్టుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మిస్తారు. ఇలా పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. విషయం స్థానికులకు అర్థమవడంతో నిందితులను మంగళవారం ఉదయం పట్టుకొని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.  

మరిన్ని వార్తలు