నకిలీ సొసైటీ పేరుతో రూ.14కోట్ల స్థలానికి ఎసరు!

11 Aug, 2021 13:37 IST|Sakshi

మాదన్నపేట మార్కెట్‌లో నకిలీ సొసైటీ రగడ 

అక్రమార్కులపై చర్యలకు సిద్ధమైన అసలు కమిటీ  

చంచల్‌గూడ: అక్రమార్కులు కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తూ కోట్ల విలువ చేసే స్థలానికి ఎసరు పెడుతున్నారు. ఒక సొసైటీలోని కొందరు వ్యక్తులు చట్ట విరుద్ధంగా మరో సొసైటీ ఏర్పాటు చేసి రూ.14 కోట్లు విలువ చేసే స్థలాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు పథకం పన్నారు. 

కుర్మగూడ డివిజన్‌ మాదన్నపేటలో దయానంద వెజిటెబుల్‌ మార్కెట్‌ పేరుతో 4 ఎకరాల్లో కూరగాయల మార్కెట్‌ 1980లో స్థాపించారు.  
 ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు అసలైన సంస్థకు ‘శ్రీ’జోడించి శ్రీ దయానంద పేరుతో మరో నకిలీ సొసైటీ ఏర్పాటు చేశారు. స్థలం కాజేసేందుకు పథకం రచించారు.  
కమిటీకి సంబంధం లేని బయటి వ్యక్తికి దాదాపు 2500 గజాలు నకిలీ సొసైటీ పేరుతో అప్పజెప్పారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను మోసం చేసి చట్ట విరుద్ధంగా ఈ చర్యలకు పాల్పడ్డారని అసలు కమిటీ ఆరోపణలు చేస్తోంది.  
 స్థలం తీసుకున్న వ్యక్తి, నకిలీ సొసైటీ పేరుతో స్థలం అప్పజెప్పిన వారు పరస్పర కేసుల పేరుతో కుమ్మకై మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నకిలీ కమిటీ ఏర్పాటు చెల్లదంటూ సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు నకిలీ సొసైటీని రద్దు చేసింది. 
స్థలాన్ని మోసపూరితంగా కాజేసేందుకు యత్నించిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు అసలు కమిటీ సిద్ధమైనట్లు సమాచారం.  
 

మరిన్ని వార్తలు