కు.ని. ఆపరేషన్‌తో మహిళ మృతి.. క్లారిటీ ఇచ్చిన డీఎంఈ

8 Sep, 2022 17:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించింది. పాతబస్తీ పెట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్‌లో వైద్యులు ఓ మహిళకు ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన మర్నాడు నుంచి మహిళకు ఫీవర్, వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు మహిళ మహిళ మృతి చెందింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై డీఎమ్‌ఈ రమేష్‌ రెడ్డి విచారణ చేపట్టారు. పాతబస్తీ పేట్ల బురుజు ఆస్పత్రి ఘటనపై డీఎంఈ క్లారిటీ ఇచ్చారు. ఆ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వల్ల చనిపోలేదని తెలిపారు. వైరల్‌ జ్వరం వల్లే మహిళ చనిపోయిందన్నారు. మహిళకు ట్యూబెక్టమీ చేయలేదని, సీ సెక్షన్‌ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. మహిళకు ఆపరేషన్‌ జరిగిన రోజే మరో 9 మందికి సర్జరీ జరిగిందన్నారు. 9 మందిలో మరో ఇద్దరికి వైరల్‌ ఫీవర్‌ ఉందని, వారి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

కాగా ఇటీవలనే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే.        

మరిన్ని వార్తలు