మూడు రోజులుగా మృతదేహంతో ఆందోళన

18 Aug, 2021 08:45 IST|Sakshi

ఇల్లందకుంట (హుజూరాబాద్‌): కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలో మూడు రోజులక్రితం మృతిచెందిన శ్రీరాములపల్లికి చెందిన గారంపల్లి సాంబశివరావు మృతదేహంతో గ్రామస్తులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అతని మృతికి కారణమైన సోదరుడు శ్రీకాంత్‌ నుంచి బాధిత కుటుంబానికి రావాల్సిన భూమిని ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఇల్లందకుంట రోడ్డుపై దాదాపు మూడు గంటలపాటు బైఠాయించి, నిరసన తెలిపారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ఆందోళన విరమించాలని సీఐ సురేశ్‌ చెప్పడంతో, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.  న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీయబోమని, కలెక్టర్‌ వచ్చి సమాధానం చెప్పాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. శ్రీరాములపల్లిలో మూడు రోజులుగా సాంబశివరావు మృతదేహం వద్దే గ్రామస్తులు వంటావార్పు నిర్వహిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు