ఉడుము అనుకొని పామును లాగాడు

21 Jun, 2022 16:11 IST|Sakshi

నిజామాబాద్ : ఉడుము అనుకొని పామును లాగగా అది కాటు వేయడంతో ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని లింగాపూర్‌కు చెందిన కోరె లింగన్న(53) శనివారం నారుమడికి నీరు పెట్టెందుకు పొలానికి వెళ్లాడు. అక్కడ పొలం గట్టుకు ఉన్న రంధ్రంలో తోక కనిపించగా ఉడుము అనుకొని లాగాడు. అది రక్త పింజర కావడంతో బయటకు లాగగానే కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.

మరిన్ని వార్తలు