రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది

30 Aug, 2021 07:43 IST|Sakshi

పెంబి (ఖానాపూర్‌): ఓ యువరైతు కలుపుతీసే పరికరాన్ని తయారుచేసి కూలీల ఖర్చును తగ్గించుకుంటున్నాడు. పెంబి మండలానికి చెందిన పుప్పాల శ్రీనివాస్‌ పొలంలో కలుపు తీసేందుకు కూలీల కొరత, అధిక ఖర్చును తగ్గించుకోవడానికి యువరైతు యూట్యూబ్‌లో చూసి కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు. మందపల్లి శివారు వద్ద ఉన్న వరిపొలంలో ఆ యంత్రంతో కలుపు తీస్తుండడంతో సాక్షి పలకరించింది. ఈ యంత్రం తయారు చేసే విధానాన్ని వివరించారు.

మూడు ఫీట్ల పొడవున్న రెండు ఇంచుల పీవీసీ పైపు, ఆఫ్‌ ఇంచ్‌ ఇనుప పైపు, 25 గొలుసులు తీసుకోవాలి. వాటికి కేవలం వెయ్యి నుంచి 12వందల వరకు ఖర్చు వస్తుందని తెలిపారు. ముందుగా ఆఫ్‌ ఇంచ్‌ ఇనుప పైపుకు గొలుసులు వెల్డింగ్‌ చేయించి దానిని పీవీసీ పైపునకు తీగతో కట్టాలి. అంతే కలుపు నివారణ పరికరం తయారు అయినట్లే.. ఒక తాడు సాయంతో ఒక్కరితో ముందుకు నడుస్తూ పోతే చిన్న చిన్న కలుపు మొక్కలు గొలుసులకు తట్టుకోని బయటకు వచ్చి చనిపోతాయి. అంతే కాకుండా వరి మొక్కలను నాశనం చేసే కీటకాలు సైతం నీటిలో పడిపోతాయి.  ఈ పరికరం గత సంవత్సరం నుంచి వాడుతున్నట్లు తెలిపాడు. దీంతో కూలీల ఖర్చు తగ్గిందని వివరించాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు