విద్యుదాఘాతంతో రైతు మృతి

10 Aug, 2021 03:00 IST|Sakshi

పెద్దవూర: విద్యుదాఘాతంతో మాజీ సర్పంచ్‌ మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో సోమ వారం ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన బూరుగు గోపాల్‌ (54) వ్యవసాయం చేస్తున్నారు. వరినాటు వేసేందుకు మడులకు తడి అందించేందుకు ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. బోరు పోయకపోవడంతో పక్కనే ఉన్న రైతు బోరును చూసేందుకు వెళ్లాడు. కాగా, పక్కనే ఉన్న బత్తాయి తోట రైతు వ్యవసాయ బోరుకు విద్యుత్‌ సరఫరా కోసం ఫెన్సింగ్‌ మీదుగా బంజరు కేబుల్‌ తీగను తీసుకెళ్లాడు. అప్పటికే బంజరు కేబుల్‌ వైరు ఎక్కడో తెగిపోయి ఫెన్సింగ్‌కు విద్యుత్‌ సరఫరా అవుతోంది. గోపాల్‌ పొలం గట్టుపై నుంచి వెళ్తూ కాలు జారి ఫెన్సింగ్‌పై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. గోపాల్‌ గతంలో శిర్సనగండ్ల పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేశారు. 

మరిన్ని వార్తలు