టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై రాళ్ల దాడి

15 Oct, 2020 12:40 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన గురువారం మేడిపల్లి చెరువు పూజలు చేసేందుకు వెళ్లారు. ఎమ్మెల్యే రాకను గ్రామ ప్రజలు, రైతులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని కిషన్‌రెడ్డిని నిలువరించారు. దీంతో మేడిపల్లి చెరువు దగ్గర ఉద్రికత్త పరిస్థితుల నెలకొన్నాయి. . ఫార్మాతో భూములు కోల్పోతుంటే పరామర్శించకుండా.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఓ దశలో ఆయన వాహనాలపై రైతులు రాళ్లు, చెప్పులు విసిరారు. రైతుల విసిరిన రాళ్ల దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఫార్మసిటీ అక్రమ భూ సేకరణ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. ఫార్మా సిటీకి ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి రాజీనామా చేయాలంటూ ఆయనపైకి రైతులు దూసుకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. నిరసన తెలుపుతున్నమాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో సహా పలువురి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాచారంలో రైతుల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక మేడిపల్లి చెరువు సందర్శనకు ఎమ్మెల్యే రాకతో పోలీసులు కొంతమంది రైతులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు