జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్‌ ప్లాన్‌ను నిరసిస్తూ అష్టదిగ్భందనం

19 Jan, 2023 10:05 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: మాస్టర్‌ ప్లాన్‌ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్భందనానికి గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాలలో నలువైపులా రహదారుల దిగ్బంధం చేయనున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలకు రైతుల ప్రణాళికలు సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్ వద్దంటూ రైతులకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. 

మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిరసిస్తూ పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. తమ గ్రామాన్ని మాస్టర్ ప్లాన్‌ నుంచి తొలగించాలని గ్రామ పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. తీర్మాన ప్రతిని జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌కు ప్రజలు అందజేశారు. తిమ్మాపూర్ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు.  మాస్టర్ ప్లాన్‌పై నిరసనలు ఉదృతం చేసేందుకు రైతు జేఏసీ ఏర్పాటుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు.

జగిత్యాల బల్దియా జారీ చేసిన ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌పై బుధవా రం కూడా ఆందోళనలు కొనసాగాయి. జగిత్యా ల అర్బన్‌ మండలం తిప్పన్నపేట గ్రామ రైతులు పంచాయతీ కార్యాలయం ఎదుట సమావేశమై ఆందోళన నిర్వహించారు. మరోవైపు.. మోతె, ధరూర్, తిప్పన్నపేట, నర్సింగాపూర్, హస్నాబాద్, అంబారిపేట, తిమ్మాపూర్‌ గ్రామాలను మాస్టర్‌ప్లాన్‌ నుంచి తొలగించాలని కోరుతూ మోతె సర్పంచ్‌ భర్త సురకంటి రాజేశ్వర్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు పోస్టు చేశారు.

మరిన్ని వార్తలు