హైద‌రాబాద్ -వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారిపై భారీ ట్రాఫిక్ జామ్‌

16 Nov, 2021 13:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరి కొనుగోలు వ్యవహరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా.. హైదరాబాద్ వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారిపై రైతులు మంగళవారం ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. ఈ క్రమంలో బీబీన‌గ‌ర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వ‌ద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధ‌ర్నా చేశారు.  జాతీయ ర‌హ‌దారిపై  రైతులు ఒడ్లుపోసి త‌గ‌ల‌బెట్టారు.  దీంతో బీబీన‌గ‌ర్‌-హైద‌రాబాద్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
(చదవండి: ధాన్యం మద్దతు ధర పొందాలంటే..

ఉద‌యం నుంచి ట్రాఫిక్ జామ్ కావ‌డంతో అధికారులు, పోలీసులు అక్క‌డికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసే ప్ర‌యత్నం చేస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరిపంట విష‌యంలో కేంద్రానికి, రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్ని మ‌ధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయ‌డం లేద‌ని, రైతులు యాసంగిలో వ‌రికి బ‌దులుగా ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేయాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం చెబుతున్న‌ది. 

చదవండి: నెగిటివ్‌ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్‌!

మరిన్ని వార్తలు