Chakradhar Goud: వంద రైతు కుటుంబాలకు రూ.కోటి సాయం

26 Sep, 2022 08:39 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట జోన్‌: రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ చక్రధర్‌ గౌడ్‌ అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వంద రైతు కుటుంబాలకు.. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.కోటి విలువైన చెక్కులను ఆదివారం సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్స్‌లో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడం, వారికి అండగా నిలిచే లక్ష్యంగా తమ సంస్థ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. 

చదవండి: (నీ కాళ్లు మొక్కుత సారూ.. పైసలిప్పియ్యరూ: రైతు ఆవేదన)

మరిన్ని వార్తలు