గ్రూప్‌–1 మెయిన్స్‌కు తండ్రీ తనయుడు

17 Jan, 2023 02:12 IST|Sakshi
బాలనర్సయ్య, సచిన్‌ 

యాదగిరిగుట్ట రూరల్‌: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి మెయిన్స్‌కు తండ్రీ కొడుకులు అర్హత సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు ఏలూరు బాల­నర్సయ్య (48), ఏలూరు సచిన్‌ (22) శనివారం విడుదలైన ఫలితాల్లో ఒకేసారి ఈ ఘనత సా­ధిం­­చారు. బాలనర్సయ్య ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు.

సచిన్‌ హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటూ గ్రూప్‌–1కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా తండ్రి ఇంతకుముందే గ్రామంలో సర్పంచ్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ఇద్దరూ ఒకేసారి మెయిన్స్‌కి అర్హత సాధించడం ఆనందంగా ఉందని బాలనర్సయ్య చెప్పారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు