టీఆర్‌ఎస్‌లో 16, ఎంఐఎంలో 13 మంది నేరచరితులు

17 Nov, 2020 09:06 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేరచరితులకు టికెట్‌ ఇవ్వోద్దు: ఎఫ్‌జీజీ

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వవద్దని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. గతంలో అన్ని పార్టీల నుంచి కలిపి 72 మంది నేరచరిత్ర ఉన్నవాళ్లు టికెట్లు దక్కించుకుని పోటీ చేశారని తెలిపింది. అందులో 30 మంది అభ్యర్థులు గెలిచారని, ఈ లెక్కన పాలకమండలిలో 20 శాతం మంది కార్పొరేటర్లు నేరచరిత్ర కలిగి ఉన్నారని వివరించింది. పార్టీలవారీగా చూసుకుంటే టీఆర్‌ఎస్‌లో 16 మంది, ఎంఐఎంలో 13 మంది,  బీజేపీలో ఒక్కరి చొప్పున ఉన్నారని వెల్లడించింది. నేరచరితులు బరిలో నిల్చుంటే విద్యావంతులు ఓటింగ్‌పై విముఖత చూపుతారని, ఫలితంగా ఓటింగ్‌ శాతం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లోనైనా నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకూడదని అన్ని పార్టీలను ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో కోరారు.  (చదవండి: ఎన్నికలపై స్టే కోరుతూ వ్యాజ్యం‌.. హైకోర్టు ఆగ్రహం)

మరిన్ని వార్తలు