కొత్త కార్పొరేషన్లు ఇవ్వొద్దు.. ప్రజాధనం వృథా చేయొద్దు

4 Jan, 2023 02:19 IST|Sakshi

సీఎస్‌ సోమేశ్‌కు ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖలకు కార్పొరేషన్ల చైర్మన్లను నియమించి ప్రజాధనం వృథా చేయొద్దని ఫోరం ఫర్‌ గుడ్‌ గవ ర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) తెలిపింది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, డెవలప్‌మెంట్‌ అథా రిటీలు కలిపి 70 వరకు ఉన్నాయని, కొన్ని మినహాయిస్తే చాలా కార్పొ రేషన్లు కేవలం కళ తప్పిన రాజకీయ నాయకులను చైర్మన్లుగా నియమిండానికి మాత్రమే ఏర్పాటు చేసినట్లు ఉన్నాయని విమర్శించింది.

దీంతో ప్రభుత్వ ఖజానాకు భారం పడుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖరాశారు. కార్పొరేషన్లు, డెవలప్‌మెంట్‌ అథా రిటీల పనితీరు ఎప్పుడు, ఎవరూ కూడా విశ్లేషణ చేయలేదని, కొన్ని అయితే శాఖల పనిని డూప్లికేట్‌ చేయగా, మరికొన్ని ఏ పనీ లేకుండా ఉన్నాయని ఆరోపించారు.

కార్పొరేషన్‌ చైర్మన్లకు జీతాలు, కార్యాలయం, తగిన సిబ్బంది, ప్రభుత్వ వాహనం, డ్రైవర్, వారి జీతభత్యాలతో రూ.2 కోట్ల వరకు ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పని లేని కార్పొరేషన్లను మూసేయా లని, ఎలాంటి కార్పొరేషన్లు నెలకొల్పవద్దని సీఎస్‌కు రాసిన లేఖలో పద్మనాభరెడ్డి కోరారు.   

మరిన్ని వార్తలు