చేతులెత్తి మొక్కుతాం .. టీఆర్‌ఎస్‌ను ఓడించండి 

8 Oct, 2021 02:02 IST|Sakshi

హుజూరాబాద్‌లో ఫీల్డ్‌ అసిస్టెంట్ల ప్రచారం 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: చేతులెత్తి మొక్కుతాం..హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నిరసనగా ఉపఎన్నికలో నామినేషన్లు వేసేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు గురువారం భారీగా హుజూరాబాద్‌కు తరలివచ్చారు. అయితే తాము నామినేషన్లు వేయకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారని వారు ఆరోపించారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జేఏసీ చైర్మన్‌ శ్యామలయ్య నేతృత్వంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. దండం పెడుతూ, గడ్డం పట్టుకుని బతిమాలుతూ ఈ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. అంతకుముందు హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది రోడ్డుపైనే నిరసన చేపట్టారు.   

మరిన్ని వార్తలు