మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు.. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు 

12 Aug, 2023 09:41 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మరో పదిమందిపై కేసులు నమోదయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా కేసు నమోదు చేయాలని కోర్టు  ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు మహబూబ్‌నగర్‌ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నేడు రెండవ శనివారం, 13న ఆదివారం సెలవు ఉండటంతో  14న కోర్టుకు కేసుకు సంబంధించిన నివేదిక ఇవ్వడానికి పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం.
చదవండి: కారిడార్‌ వార్‌!... ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనుల్లో జాప్యం

ఇదీ కేసు.. 
ఎన్నికల అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌పై దాఖలైన కేసులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర, కేంద్ర రిటర్నింగ్‌ అధికారులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 2018, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ను శ్రీనివాస్‌గౌడ్‌ ట్యాంపరింగ్‌ చేశారని, అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దావా వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి, మంత్రి సహా సదరు అధికారులపై కేసు నమోదు చేయాలని తీర్పునిచ్చారు.  

కేసు నమోదైంది వీరిపైనే.. 
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అప్పటి అధికారులు, ప్రస్తుత ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా అండర్‌ సెక్రటేరియల్‌ రాజీవ్‌కుమార్, సంజయ్‌కుమార్, రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్, సెక్రెటరీ, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్, కలెక్టర్‌ వెంకట్రావు, డిప్యూటీ కలెక్టర్‌ పద్మశ్రీ, ఆర్డీఓ శ్రీనివాసులు, టెక్నికల్‌ అధికారి వెంకటే‹Ùగౌడ్, విశ్రాంత ఉద్యోగి సుధాకర్, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదైనట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు