Gandhi hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

20 Oct, 2021 08:56 IST|Sakshi

హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రిలో ఈరోజు(బుధవారం) ఉదయం ఏడున్నర గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడో ఫ్లోర్‌లో ఉన్న.. విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డు రూమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో ఆరో​ ఫ్లోర్‌ వరకు మంటలు వ్యాపించాయి.  వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. కేవలం 40 నిమిషాలలోనే మంటలను అదుపులోకి తీసుకోచ్చారు.

ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాదం తెలిసిన వెంటనే గాంధీ ఆసుపత్రి సూపరింటెండేంట్‌ రాజరావు ప్రమాదం జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. 

సాక్షి టీవీతో గాంధీ సూపరింటెండెంట్ రాజారావు:
ఉదయం గాంధీ ఆస్పత్రి ఎలక్ట్రికల్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అన్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. కోవిడ్‌ సమయంలో కొంత మంది సిబ్బందికి ప్రమాదం జరగ్గానే స్పందించాల్సిన తీరుపై శిక్షణ ఇచ్చామని తెలిపారు.

ఆసుపత్రిలో ఫైర్‌సేఫ్టీ మెజర్మెంట్స్‌ ఉన్నాయని అన్నారు. కరోనా పాండమిక్‌ సమయంలో ఫైర్‌ సేఫ్టీ పరికరాలన్ని ఇక్కడ అమర్చినట్లు తెలిపారు. నార్త్‌ బ్లాక్‌లో ప్రస్తుతం పెషేంట్‌లు లేరని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను పక్క వార్డులోకి షిఫ్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు