కోఠి మెడికల్‌ కాలేజ్‌ బస్టాప్‌ వద్ద అ‍గ్ని ప్రమాదం

6 Jun, 2021 19:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోఠి మెడికల్‌ కాలేజ్‌ బస్టాప్‌ వద్ద ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. కాగా బస్టాప్‌కు ఆనుకొని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్‌ సర్య్కూట్‌ వల్ల ప్రమాదం జరిగినట్లు తేలింది. కాగా షార్ట్‌ సర్క్యూట్‌తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి బస్టాప్‌ పక్కనే ఉన్న ఫుట్‌వేర్‌ షాపుతో పాటు బట్టల దుకాణం దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్‌  అమల్లో ఉండడంతో ఆస్తి నష్టం తప్ప ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు.


 

మరిన్ని వార్తలు