లక్షలు పోసి కొన్న బుల్లెట్‌ బండి.. చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది

4 Sep, 2022 11:56 IST|Sakshi
బుల్లెట్‌ బండి నుంచి ఎగిసిపడుతున్న మంటలు 

సాక్షి, సంగారెడ్డి:  రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మార్కెట్లో ఎన్ని కొత్త మోడల్‌ బైక్‌లు వచ్చినప్పటికీ బుల్లెట్‌పై యువతకు ఉన్న క్రేజ్‌ మామూలుగా ఉండదు.. లక్షలకు లక్షలు పోసి మరి కొనుక్కొని తమ సొంతం చేసుకుంటారు. డుగ్గు డుగ్గు సౌండ్లతో రోడ్లపై రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని వాహనాల్లో ఉన్నట్టుండి మంటల్లో కాలిపోతున్నాయి. తాజాగా ఓ  బుల్లెట్‌ బండిని స్టార్ట్‌ చేసే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటన పటాన్‌చెరు పట్టణంలో చోటు చేసుకుంది. ఫైర్‌స్టేషన్‌ ఆఫీసర్‌ జన్యానాయక్, స్థానికుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన జావిద్‌ తన బుల్లెట్‌ బండిని పటాన్‌చెరు పట్టణంలో ని బ్లాక్‌ ఆఫీసు దుకాణాల ఎదుట పార్క్‌ చేశాడు. పని ముగించుకొని తిరిగి బండిని స్టార్ట్‌ చేసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. 

మరిన్ని వార్తలు