ఎట్టకేలకు డక్కన్‌మాల్‌ నేలమట్టం

5 Feb, 2023 11:15 IST|Sakshi

సికింద్రాబాద్‌లోని మినిస్టర్‌ రోడ్డులో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్‌మాల్‌ను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ భవనం ఆదివారం పూర్తిగా నేలమట్టం అయ్యింది. గత తొమ్మిది రోజులుగా కూల్చివేత పనులు జరుగుతుండగా.. ఎట్టకేలకు ఆదివారానికి దక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులు పూర్తి అయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. భవనం నేలమట్టం కావడంతో శిథిలాలను తొలగించే పనులను వేగవంతం చేశారు.

ఈ భవనం కూల్చివేతలో ఎలాంటి ఆస్టి, ప్రాణ నష్టం జరగకపోవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల నాలుగు రోజుల క్రితం మాల్‌ని కూల్చివేస్తుండగా ఒక్కసారిగా సగం భవనం  కూలిన సంగతి తెలిసిందే. ఆ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో చుట్టుపక్కల వారంతా భయాందోళనకు లోనయ్యారు. సరిగ్గా ఆ సమయానికి ఆ ప్రదేశంలో చుట్టుపక్కల వారు ఎవ్వరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అదీగాక ఈ భవనం కూల్చివేత పనులు కారణంగా అధికారులు చుట్టపక్కల ప్రాంతాల నివాసితులను ఖాళీ చేయిందచారు.

దీంతో చాలా వరకు ప్రాణపాయం తప్పిందనే చెప్పాలి. అంతేగాక ఆ మాల్‌ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ కూల్చివేత పనులన కాంట్రాక్టర్‌ను తొలుత ఎస్కే మల్లు కంపెనీ దక్కించుకున్న మధ్యలో జీహెచ్‌ఎంసీ ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి మాలిక్‌ ట్రేడర్స్‌కు పని అప్పగించింది. పనులు వేగవంతంగా చేసిన ఆ సంస్థ..ఎట్టకేలకు దక్కన్‌ మాల్‌ భవనాన్ని ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నేలమట్టం చేసింది.

(చదవండి: డెక్కన్‌ మాల్‌ కూల్చివేత షురూ.. ఆఖరు అంతస్తు నుంచి మొదలు..)


 

మరిన్ని వార్తలు