డెక్కన్‌ మాల్‌ కూల్చివేత షురూ.. ఆఖరు అంతస్తు నుంచి మొదలు..

27 Jan, 2023 09:13 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌: మినిస్టర్‌ రోడ్‌లో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించిన రాధే ఆర్కెడ్‌ (డెక్కన్‌ భవనం) కూల్చివేతలు ఎట్టకేలకు మొదలయ్యాయి. కూల్చివేతల కాంట్రాక్ట్‌ను మొదట దక్కించుకున్న ఎస్కే మల్లు ఏజెన్సీ వద్ద సరైన మెషినరీ లేకపోవడంతో అధికారులు అదే ధరకు మాలిక్‌ ట్రేడింగ్‌ అండ్‌ డిమాలిషన్‌ అనే మరో కంపెనీకి టెండర్‌ను అప్పగించారు.

జపాన్‌లో తయారైన ‘హైరిచ్‌ కాంబీ క్రషర్‌’ అధునాతన యంత్రాన్ని గురువారం సాయంత్రం ఈ భవనం వద్దకు తీసుకువచ్చి ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టారు. ఆరు అంతస్తులున్న భవనాన్ని ఎలా కూల్చాలనే దానిపై కసరత్తు చేశారు. చుట్టూ ఉన్న బస్తీ, అపార్ట్‌మెంట్లకు నష్టం వాటిల్లకుండా కూలి్చవేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కసరత్తులన్నీ పూర్తి చేసిన తర్వాత గురువారం రాత్రి 11 గంటలకు పనులు మొదలు పెట్టారు. ఈ నెల 19న డెక్కన్‌ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. భవనం 70 శాతం దెబ్బ తిన్నదని నిట్‌ నిపుణుల బృందం తేల్చడంతో కూల్చివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.   

శిథిలాలు నేరుగా కిందకు.. 
డెక్కన్‌ భవనాన్ని ఆరో అంతస్తు నుంచి కూల్చివేతలు మొదలు పెట్టి కింద వరకు పూర్తి చేయనున్నారు. గ్రౌండ్‌ నుంచి 80 అడుగుల ఎత్తులో ఉండే వాటిని కూలి్చవేయవచ్చు. ప్రస్తుతం భవనం 70 అడుగుల ఎత్తు ఉంది. పిల్లర్స్, కాలమ్స్‌ను ఈ మెషిన్‌ కట్‌ చేస్తుంది. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. అనంతరం శిథిలాలు మొత్తం కింద ఏర్పాటు చేసిన డ్రాపింగ్‌ జోన్‌లో వచ్చి పడతాయి. ఎలాంటి శబ్దాలు, వైబ్రేషన్స్‌ లేకుండా కూల్చివేయడం ‘హైరిచ్‌ కాంబీ క్రషర్‌’ యంత్రం ప్రత్యేకత. భారత్‌లో ఇలాంటి యంత్రాలు కేవలం 3 మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్పారు.  

కాగా.. అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టడంతో చుట్టుపక్కల నివసించేవాళ్లలో టెన్షన్‌ మొదలైంది. దీన్ని ఆనుకునే కాచిబోలి బస్తీ, వెనుక వైపు ఉత్తమ్‌ టవర్స్, గగన్‌ ప్యారడైస్‌ అపార్ట్‌మెంట్ల వాసుల్లోనూ ఆందోళన మొదలైంది. భవనం సమీపంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నా.. స్థానికుల్లో మాత్రం భయం మాత్రం వీడలేదు.  మొత్తం భవనం కూల్చిన తర్వాతే.. మిగతా వారి అవశేషాల ఆచూకీ దొరికే అవకాశముంది. ఇందుకోసం మరో నాలుగైదు రోజుల నిరీక్షణ తప్పదు.    

12 నుంచి 15 రోజుల్లో..   
భవనం కూలి్చవేతకు 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని, శిథిలాలు మొత్తం తరలించి క్లియర్‌ చేసేందుకు సుమారు 12 నుంచి 15 రోజులు పట్టవచ్చని మాలిక్‌ ట్రేడింగ్, డిమాలిషన్‌ కంపెనీ డైరెక్టర్‌ రెహా్మన్‌ ఫరూఖ్‌ తెలిపారు. గతంలో 70 భవనాలను తాము కూలి్చవేయగా ఇలాంటి ఎత్తైనవి 11 అంతస్తులు కూలి్చవేశామని చెప్పారు. ఇందులో వాటర్‌ స్ప్రింక్లర్స్‌ కూడా ఉంటాయని ఎక్కడైనా ఫైర్‌ ఉన్నా మంటలను ఆరి్పవేస్తుందన్నారు. చాలా తక్కువ మ్యాన్‌ పవర్‌తో కూల్చివేస్తామని ఆయన వివరించారు.  

మరిన్ని వార్తలు