మొదటి విడత టీకా వేసేది వీరికే..

12 Dec, 2020 00:46 IST|Sakshi

జిల్లాల వారీగా జాబితా తయారు చేసిన వైద్య, ఆరోగ్యశాఖ 

హైదరాబాద్‌లో ఎక్కువగా 76,804 మంది వైద్య సిబ్బందికి

ప్రభుత్వ వైద్య సిబ్బంది 1.25  లక్షలు

ప్రైవేటు వైద్య సిబ్బంది 1.42  లక్షలు

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో కరోనా టీకా అందజేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి టీకా వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి జాబితాను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది జాబితాను తయారు చేయగా.. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఫ్రంట్‌లైన్‌లో పనిచేసే వారు, 50 ఏళ్లు దాటిన వారు, అనారోగ్య సమస్యలున్న వారి జాబితా తయారు చేయాల్సి ఉంది. జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది జాబితా వైద్య, ఆరోగ్య శాఖకు చేరింది. ఆ జాబితాను పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్‌ ఆసుపత్రులే ఎక్కువగా ఉండగా, అదేస్థాయిలో సిబ్బంది ప్రైవేట్‌లోనే ఎక్కువున్నారు. మొత్తం రాష్ట్రంలో 7,225 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 2,67,246 వైద్య సిబ్బందికి టీకా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో 1,119 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,25,007 మంది.. 6,106 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 1,42,239 మంది ఉన్నారు. వీరందరి సమాచారాన్ని కోవిడ్‌ యాప్‌లో పొందుపరిచినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇటు పోలీసులు, పారిశుద్ధ్య, రవాణా తదితర ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది జాబితాను కూడా సేకరిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు స్వచ్ఛందంగా కొవిన్‌ యాప్‌లో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవడానికి త్వరలో అవకాశం కల్పిస్తారు.

హైదరాబాద్‌లోనే అత్యధికంగా..
అన్ని జిల్లాల నుంచి అందిన సమాచారం ప్రకారం హైదరాబాద్‌ జిల్లాలోనే అత్యధికంగా వైద్య సిబ్బంది ఉన్నారు. ఇక్కడ 166 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16,516 మంది ఉండగా, 970 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 60,288 మంది ఉన్నారు. మొత్తంగా నగరంలోని 76,804 ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి వ్యా క్సిన్‌ వేస్తారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 59 ప్రభుత్వ ఆసుప త్రుల్లో 5,899, 803 ప్రైవేటు ఆసుపత్రుల్లో 19,312 మందితో జాబితా తయారైంది. ఇటు అతి తక్కువగా వైద్య సిబ్బంది ఆది లాబాద్, ఆసిఫాబాద్, గద్వాల, మంచిర్యాల జిల్లాల్లో ఉన్నారు. ఈ జాబితాను మరోసారి సరిచూసుకొని తుది జాబితాను తయారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు