మొదట విడత డిగ్రీ సీట్ల కేటాయింపు: కన్వీనర్

21 Sep, 2020 17:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్స్(దోస్త్) మొదటి విడత సీట్లను కేటాయించినట్లు ‘దోస్త్’ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి సోమవారం వెల్లడించారు. కాగా మొత్తం1,71,275 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,53,323 మంది విద్యార్థులు ఆప్షన్స్‌‌ను ఎంచుకున్నారు. వీరిలో 1,41,340 మందికి డిగ్రీ సీట్లు కేటాయించినట్లు లింబాద్రి పేర్కొన్నారు. కేటాయింపులు పూర్తయిన అనంతరం 2,66,050 సీట్లు మిగిలిపోయాయని చెప్పారు.

తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 వ తేదీ వరకు దోస్త్ వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆయన సూచించారు.  ఆ తర్వాత రెండో విడతలో వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చని తెలిపారు. మరోవైపు రెండో విడత రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం(నేటి) నుంచి మొదలైందని లింబాద్రి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు