‘నేటి నుంచి చేప పిల్లల పంపిణీ ’

6 Aug, 2020 09:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ గురువారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెం గ్రామంలోని పెంటాని చెరువులో చేప పిల్లలు పోసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మత్స్యశాఖ గుర్తించిన 24 వేల నీటివనరుల్లో రూ.60 కోట్ల వ్యయంతో 81 కోట్ల చేప, 5 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (తెలంగాణలో కొత్తగా 2092 కరోనా కేసులు)

అటవీ శాఖ టెండర్ల స్వీకరణ గడువు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్‌: అటవీ శాఖ పరిధిలోని ఫారెస్ట్‌ బ్లాక్‌ల్లో అర్బన్‌ పార్కుల అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కమాండ్‌ ఏరియాల్లో పనుల నిర్వహణకు సంబంధించిన ఈ–టెండర్ల స్వీకరణ గడువును తగ్గించారు. గతంలో టెండర్‌ నోటీసు ప్రకటించిన తేదీ నుంచి 14 రోజుల్లో (ఫస్ట్‌ కాల్‌) టెండర్ల స్వీకరణ గడువు ఉండగా, ఆ మేరకు గతంలో జారీ చేసిన జీవోలోని నిబంధనను సడలిస్తూ ఈ వ్యవధిని వారం రోజులకు తగ్గిస్తూ బుధవారం అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు