నెక్లెస్‌ రోడ్‌: ప్రకృతి ప్రియులకు తీపి కబురు

17 Aug, 2021 17:50 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: నగరవాసులకు తీపి కబురు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నర్సరీ మేళా వచ్చేస్తోంది. ప్రకృతి ప్రియులకు చేరువలో నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆలిండియా హార్టికల్చర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ షో పేరుతో పదో గ్రాండ్‌ నర్సరీ మేళా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ఈ నర్సరీ మేళాను నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ప్రవేశ రుసుము రూ.20.

చదవండి: పేరుకి కోటీశ్వరులు.. మరి అందులో కక్కుర్తి ఎందుకో

► ఈ మేళాలో వివిధ రకాల మొక్కలు, వివిధ ప్రాంతాల అరుదైన జాతులను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా గార్డెనింగ్‌ మెథడ్స్, టెర్రస్‌ గార్డెనింగ్, వరి్టకల్‌ గార్డెనింగ్, హైడ్రోపోనిక్, కిచెన్‌ గార్డెనింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.  
► దేశవ్యాప్తంగా వివిధ జాతుల మొక్కలను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కల పెంపకంపై అవగాహన కలిగించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ మేళాలో వందస్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నర్సరీ ప్లాంట్లు కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.  
► గ్జోటిక్‌ ప్లాంట్స్, బోన్సాయ్, అడనీయం, ఇండోర్, అవుట్‌డోర్, హై క్వాలిటీ ఫ్రూట్స్‌ అండ్‌ ఫ్లవర్‌ ప్లాంట్స్, మెడిసినల్‌ అండ్‌ ఆక్సిజన్‌ ప్యూరిఫయింగ్‌ ప్లాంట్స్, ఆర్గానిక్‌ మొక్కలు, సేంద్రీయ ఎరువులు, సెరామిక్‌ అండ్‌ ఫైబర్‌ ప్లాంట్‌ స్టాండ్స్, హై క్వాలిటీ సీడ్స్, బల్బ్సŠ, టూల్స్, దేశీయ, అంతర్జాతీయ ఎక్విప్‌మెంట్‌ ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. కోవిడ్‌ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ మేళా జరుగుతోంది.

మరిన్ని వార్తలు