గల్ఫ్‌ చట్టాలు తెలియక చిక్కుల్లో..

18 Oct, 2022 01:15 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌ చొరవతో ఇంటికి రానున్న తెలంగాణ యువకులు

సిరిసిల్ల: దుబాయ్‌లోని చట్టాలపై అవగాహన లేక అక్కడ చిక్కుల్లో పడ్డ ఐదుగురు తెలంగాణ యువకులు మంత్రి కేటీఆర్‌ చొరవతో ఎట్టకేలకు సొంతూళ్ళకు రానున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకి  చెందిన గుగులోత్‌ అరవింద్,  పెద్దోళ్ల స్వామి,  గొల్లపెల్లి రాము, అనిల్, నిజామాబాద్‌ జిల్లాకి చెందిన నరేందర్‌ ఐదు నెలల కిందట కంపెనీ వీసాలపై లైసెన్స్‌ ఏజెంట్స్‌ ద్వారా దుబాయ్‌కి వెళ్లారు. లేబర్‌క్యాంపులో వసతులు కల్పించి పని ఇచ్చినా.. వెళ్లేందుకు నిరాకరిస్తూ గొడవకు దిగారు.

దాంతో లేబర్‌కోర్టు అధికారులు అక్కడి సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించి వీరి ప్రవర్తన బాగా లేదని నిర్ధారించి, దేశం విడిచి పోకుండా పాస్‌పోర్టులపై ఆంక్షలు విధించారు. కాగా ఈ ఐదుగురు తిరిగి భారత్‌ వచ్చేందుకు దుబాయ్‌ ఎయిర్‌ పోర్టుకు వెళ్ళగా. ఆ పాస్‌పోర్టులపై ఆంక్షలు ఉండడంతో ఎయిర్‌పోర్టు అధికారులు వారిని వెనక్కి పంపారు. దీంతో వారు గల్ఫ్‌ ఏజెంట్‌ చేతిలో మోసపోయామని కేటీఆర్‌ ఆదుకోవాలంటూ ఎయిర్‌పోర్టు ముందు నుంచి వీడియో తీసి వైరల్‌ చేశారు.

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో...
వీడియో పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు లేఖ రాశా రు. దుబాయ్‌లోనే ఉండే గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి అధ్య క్షుడు గుండెల్లి నర్సింహులు ఎంబసీ అధికారులతో మాట్లా డి, కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఇందులో కంపెనీ తప్పిదం ఏమీ లేదని, ఉపాధి కోసం వచ్చిన సదరు యువకు ల పొరపాటుతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో వారికి విమాన టికెట్లను సమకూర్చగా మూడు రోజుల్లో ఇండియాకు రానున్నారు. 

మరిన్ని వార్తలు