వరదలతో హైటెన్షన్‌.. భద్రాచలానికి మళ్లీ ముంపు భయం! సీఎం కేసీఆర్‌ సమీక్ష

12 Sep, 2022 08:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎగువన కురుస్తున్న వర్షాలతో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర 9 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. 

వరద పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితిని సమీకక్షించారు. గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తక్షణమే సచివాలంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.

ఇంతకు ముందు వరదలతో భద్రాచలం తీవ్రంగా నష్టపోయింది. దీంతో ప్రస్తుత వరదలతో మళ్లీ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సర్కార్‌ భావిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో.. ప్రమాద హెచ్చరికల జారీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: పచ్చని చెట్టు పొట్టనబెట్టుకుంది

మరిన్ని వార్తలు