కమ్మేసిన పొగమంచు 

17 Feb, 2023 01:44 IST|Sakshi
హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై  ఉదయం 9 గంటల సమయంలో పొగమంచు  

కోదాడ, మునగాల: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం పరిసర ప్రాంతాలు, మునగాల మండల కేంద్రాన్ని గురువారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలైనా మంచు తెరలు వీడకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. 65వ నంబర్‌ (హైదరాబాద్‌ –విజయవాడ) జాతీయ రహదారిపై దీపాలు వెలిగించి వాహనాలను నడపాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు