విషాదం: ఫుడ్‌ పాయిజన్‌తో ఇద్దరు చిన్నారులు మృతి

17 Aug, 2021 12:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే ఓ కుటుంబం శీతల పానియం తాగి పడుకున్నారు. తల్లి బాలమణి(35)తో పాటు, కూతురు మనీషా(13), కొడుకు కుమార్‌కు తీవ్రమైన కడుపు నొప్పి రావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. తండ్రి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తూప్రాన్ మండలం వెంకటాయ పల్లి గ్రామానికి చెందిన కుటుంబీకులుగా గుర్తించారు.

మరిన్ని వార్తలు