తెలంగాణ: కాగజ్‌నగర్ గురుకులంలో ఫుడ్‌పాయిజన్‌.. పురుగులు వస్తున్నాయంటున్న పిల్లలు

20 Sep, 2022 08:42 IST|Sakshi

ఆసిఫాబాద్‌: కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్‌పాయిజన్‌ ఘటన చోటు చేసుకుంది. భోజనం వికటించి యాభై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాత్రికి రాత్రే వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షలోనే వాళ్లంతా ఉన్నారు. ఇదిలా ఉంటే.. భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఫిర్యాదు చేయడం విశేషం.

మరిన్ని వార్తలు