TS: గోదారమ్మ ఉగ్రరూపం.. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదని బాధితుల ఆవేదన

16 Jul, 2022 13:03 IST|Sakshi

గోదావరి వరద ఉధృతి కారణంగా భద్రాచలం నీట మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నివాసితులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. 

ఈ సందర్బంగా వరద బాధితులు ఆందోళనకు దిగారు. కరకట్ట పొడిగింపుపై హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రోడ్డుపై బైఠాయించి సుభాష్‌ నగర్‌ వరకు కరకట్టను పొడగించాలని నినాదాలు చేశారు. వరదల్లో చిక్కుకున్న తమకు తాగేందుకు నీరు కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని కన్నీంటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మంత్రి వచ్చి ఫొటోలు తీసుకుని వెళ్లిపోయారు. సమస్యలు మాత్రం పరిష్కరించలేదు. కరకట్ట పొడిగించి తమకు న్యాయం చేయాలన్నారు. 

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వీరయ్య వరద బాధితులకు మద్దతు తెలిపారు.   ఇక, అధికారులు సుభాష్‌ నగర్‌ ప్రజలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు.. గోదారమ్మ కొంచెం శాంతించింది. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 70.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. కానీ, మూడో ప్రమాద హెచ్చరిక మాత్రం కొనసాగుతోంది. మరో 24 గంటలు కీలమని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: రైలులో భద్రాచలానికి గవర్నర్‌ తమిళిసై.. అటు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

మరిన్ని వార్తలు