చిరుత కాదు.. అడవి పిల్లులే 

8 Feb, 2021 09:09 IST|Sakshi

భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ వెల్లడి

సాక్షి,/హైదరాబాద్‌/శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం పరిసరాల్లో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు లేవని, చుట్టుపక్కల ప్రజలు, విమానాశ్రయ సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ స్పష్టం చేసింది. కెమెరాల్లో కేవలం ఊర కుక్కలు, అడవి పిల్లులు, పందులు మాత్రమే కనిపించాయన్నారు. చిరుతపులి కదలికలున్నాయని, అడవి పందులను చంపుతోందని విమానాశ్రయం అధికారుల ఫిర్యాదుతో వాటిని పరిశీలించగా వాటిని కుక్కలు చంపినట్లుగా ఆధారాలు లభించినట్టు పేర్కొంది. అధికారులు విజ్ఞప్తితో ముందు జాగ్రత్తగా 10 ట్రాప్‌ కెమెరాలు కూడా పెట్టగా, వాటిలో చిరుతపులి కదలికలేవీ కనిపించలేదని తెలిపింది. విమానాశ్రయం ప్రహరీ దూకినట్లుగా గతంలో సీసీ కెమెరాలకు లభించిన ఆధారాలు సివిట్‌ క్యాట్‌ వి (మానుపిల్లి) అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు అధికారుల విజ్ఞప్తి మేరకు మరొక 10 ట్రాప్‌ కెమెరాలు, (మొత్తం 20), రెండు బోనులు (ట్రాప్‌ కేజెస్‌) కూడా పెట్టినట్టు తెలియజేశారు.

(చదవండి: అది చిరుతేనా?)

మరిన్ని వార్తలు