అటవీశాఖ కార్యాల‌యంపై రాళ్ల దాడి

8 Sep, 2020 10:36 IST|Sakshi

ఖానాపూర్ : నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీశాఖ కార్యాలయంపై సోమవారం పలువురు రాళ్లతో దాడి చేశారు. ఈ నెల 6న మండలంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్న యువకుడిని అటవీ అధికారులు పట్టుకున్నారు. విచారణ పేరుతో రెండు రోజులుగా చిత్రహింసలు పెట్టడంతో ప్రాణాపాయ స్థితికి చేరాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు కార్యాలయంపై దాడి చేశారు. రేంజ్‌ కార్యాలయంతో పాటు ఎఫ్‌డీవో గెస్ట్‌హౌస్‌ అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. పలువురు అధికారులు, సిబ్బంది కార్యాలయ తలుపులు వేసుకుని లోపలే ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కాగా పలు వన్యప్రాణులను వేటాడిన యువకుడు చిరుతను హతమార్చేందుకు యత్నించాడని, తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. కేసులు నమోదు చేస్తామనే భయంతో యువకుడు స్పృహ కోల్పోయాడని ఎఫ్‌డీవో కోటేశ్వర్, ఎఫ్‌ఆర్‌వో వినాయక్‌ తెలిపారు.  దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చెప్పుతో కొట్టిన సర్పంచ్‌.. యువకుడి ఆత్మహత్య)

మరిన్ని వార్తలు