భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతి

12 Apr, 2021 11:02 IST|Sakshi

శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ మృతి

సీపీఎం తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం

సాక్షి, భద్రాద్రి: భద్రాచలం మాజీ శాసనసభ్యులు కుంజా బొజ్జి(95) అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పోందుతు సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కుంజా బొజ్జి భద్రాచలం అసెంబ్లీ నియోజకర్గం నుంచి మూడు సార్లు సీపీఎం తరుపున పోటి చేసి గెలుపొందారు. కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కుంజా బొజ్జిని బంధువులు చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇంటికి వచ్చిన తర్వాత బొజ్జి ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో హస్పిటల్‌లో చికిత్స పోందుతూ ఇవాళ ఉదయం ఆయన కన్నుమూశారు.

కుంజా బొజ్జి వరుసగా 1985,1989,1994 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటి చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీపీఎం పార్టీ తరపున అన్ని ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోనేవారు. ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతరులకు ఎన్నో సేవలందించారు. కాగా కుంజా బొజ్జి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురంలోని అడవి వెంకన్న గూడెం. ఆయన భార్య లాలమ్మ 2018లో చనిపోయారు. బొజ్జికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుంజా బొజ్జి మృతికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.

చదవండి: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ ఎక్కడైనా కనిపించారా?

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు